మల్లన్న అన్న ప్రసాద వితరనకు రూ.లక్ష విరాళం

KRNL: శ్రీశైల మల్లన్న నిత్యన్న ప్రసాద వితరన పథకానికి తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన బోరెడ్డి మల్లికార్జన రెడ్డి రూ.1,00,541ను శనివారం విరాళంగా సమర్పించారు. ఈ మేరకు సదరు భక్తుడు విరాళం మొత్తాన్ని దేవస్థానం ఏఈవో స్వాములుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.