నేటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు

నేటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు

AP: తిరుమలలో ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు నిర్వహించనున్నారు. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని అలంకరించారు. ఇవాళ మలయప్పస్వామి వారి గజవాహనం, రేపు అశ్వవాహనం, ఎల్లుండి గరుడ వాహనంపై ఊరేగుతారు. పరిణయోత్సవాల సందర్భంగా ఈ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.