సీనియర్ ఫొటోగ్రాఫర్ గోపాల్ కన్నుమూత

మహబూబ్ నగర్ టౌన్ ప్రొఫెషనల్ ఫొటో & వీడియో ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి, సీనియర్ ఫోటోగ్రాఫర్ గోపాల్ గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అసోసియేషన్ పెద్దలు, సీనియర్ ఫొటోగ్రాఫర్లు సంతాపం తెలిపారు.