'అర్ధరాత్రి అయినా రైతులకు యూరియా ఇవ్వాలి'

'అర్ధరాత్రి అయినా రైతులకు యూరియా ఇవ్వాలి'

NRPT: నర్వలోని ప్రాథమిక సహకార కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులను ఆదివారం గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి రైతుకు అర్ధరాత్రి అయినా సరే యూరియా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. నర్వకు 20% యూరియాను అధికంగా కేటాయించినా రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇకపై ఇలా జరగకుండా చూసుకోవాలన్నారు.