VIDEO: సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ
AKP: నర్సీపట్నం మండలం సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని అందజేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ అంశం మీద ట్రైనర్లు శ్రీనివాసరావు, సందీప్ పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండేవిధంగా అందరు పని చేయాలన్నారు.