VIDEO: గోరంట్ల పుట్టినరోజు వేడుకల్లో దుర్గేష్
E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నిడదవోలు ఎమ్మెల్యే దుర్గేష్ పాల్గొని ఎమ్మెల్యేని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ టికెట్ దుర్గేష్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా అధినేతల ఆదేశాలతో టికెట్ త్యాగం చేశారు. ఇరు వర్గాలు విభేధాలు తొలిగి నేడు ఒకే వేదికపై మెరవడం విశేషం.