రేపు కలెక్టరేట్‌లో PGRS
VZM: జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. అర్జీదారులు పూర్తి వివరాలతో రావాలని సూచించారు.