ఇన్‌స్టాగ్రామ్‌లో దుస్తులు ఆర్డర్.. రూ.50 వేల మోసం

ఇన్‌స్టాగ్రామ్‌లో దుస్తులు ఆర్డర్.. రూ.50 వేల మోసం

MHBD: ఓ వ్యక్తి దుస్తులు ఆర్డర్ చేసి రూ.50 వేలు మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 5 నెలల కిందట స్పోర్ట్స్ దుస్తులను కొనుగోలు చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తికి రూ.50 వేలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాడు. ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.