రేపటి నుంచి జరిగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు వాయిదా

SRD: ఈనెల 16, 17 తేదీల్లో జరిగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను వాయిదా వేసినట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున కబడ్డీ పోటీలు వాయిదా వేసినట్లు చెప్పారు. పోటీలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.