మోదీ పర్యటనను విజయవంతం చేయండి

ప్రకాశం: ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటనను జయప్రదం చేయాలని కనిగిరి బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య కోరారు. గురువారం పామూరు బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం అమరావతిలో జరగబోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని తెలిపారు.