'దమ్ముంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఎన్నికలకు రా'
NLG: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ విసిరారు. వేముల వీరేశం మళ్లీ 68 వేల మెజార్టీతో గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.