రెడ్ క్రాస్‌లో ముందస్తు ఉగాది వేడుకలు
NLR: ఇండియన్ రెడ్ క్రాస్ MSR సెంటర్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్పాస్టిక్ సెంటర్‌ను మామిడి తోరణాలు, బంతి పూలతో అలంకరించారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన చిన్నారులు పండుగ వైభవాన్ని చాటిచెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, MSR స్పాస్టిక్స్ సెంటర్ కోఆర్డినేటర్ దాసరి రాజేంద్రప్రసాద్ ఉగాది విశిష్టతను వివరించారు.