మీసేవా కేంద్రంలో ఏసీబీ సోదాలు
MDCL: అల్వాల్ మీసేవా కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పౌర సేవల పత్రాల జారీకి దళారుల ద్వారా మీసేవా సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. మీసేవా కేంద్ర సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగ అధికారులతో ఉన్న సంబంధాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.