మహిళా సంఘం భవనానికి భూమిపూజ

మహిళా సంఘం భవనానికి భూమిపూజ

NRPT: మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో మహిళా సంఘం నూతన భవన నిర్మాణానికి సర్పంచ్ నిర్మల మాధవరావు భూమిపూజ చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, గ్రామస్థుల సహకారం బాగుందని ఆమె తెలిపారు. అన్ని అర్హతలున్న జక్లేర్‌ను మండలంగా ప్రకటించాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు.