'ఈఎంసీలో ఉపాధి పనులు కల్పించాలి'

'ఈఎంసీలో ఉపాధి పనులు కల్పించాలి'

ఖమ్మం రూరల్ మండలం నుంచి 12 గ్రామాలతో ఏర్పడిన నూతన ఏదులాపురం మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దతండాలోని ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఉపాధి పనులు లేక ఈ 12 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.