VIDEO: వృద్దురాలి వద్ద నుంచి రూ. 3 లక్షలు కాజేసిన కేటుగాడు

VIDEO: వృద్దురాలి వద్ద నుంచి రూ. 3 లక్షలు కాజేసిన కేటుగాడు

WGL: వర్ధన్నపేటలో ఘరానా మోసం చోటుచేసుకుంది. బుధవారం ఎస్‌బీఐ బ్యాంకులో మూడు లక్షలు డ్రా చేసి బయటకు వచ్చిన వృద్ధురాలిని ఓ కేటుగాడు మాటలు కలిపి నమ్మించాడు. బండిపై దిగబెడతానని చెప్పి తీసుకెళ్లి, ఆమె వద్ద ఉన్న మొత్తం రూ. 3 లక్షలు కాజేశాడు. బాధితురాలు నందనం భారతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.