నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన: కలెక్టర్
BDK: కొత్తగూడెం మండలం, అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నిన్న ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి, హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ లభ్యత, నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ల ప్రదర్శనను కూడా ఆయన తనిఖీ చేశారు.