పిడుగు పాటు బాధితులకు న్యాయం చేయాలి: సీపీఎం

పిడుగు పాటు బాధితులకు న్యాయం చేయాలి: సీపీఎం

ప్రకాశం: కనిగిరి మండలం కలగట్లలో శుక్రవారం పిడుగు పడి 18 మేకలు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధితులను సీపీఎం జిల్లా నాయకులు పీవీ శేషయ్య కలిసి, మేకల మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన వల్ల రూ.లక్షల్లో నష్టం సంభవించిందని, 50% సబ్సిడీతో మేకల యజమానులకు రూ.5 లక్షల రుణం ప్రభుత్వం మంజూరు చేయాలని శేషయ్య డిమాండ్ చేశారు.