మైనారిటీల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: మంత్రి

మైనారిటీల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: మంత్రి

ప్రకాశం: రంజాన్ సందర్భంగా సోమవారం కొండపిలో ముస్లింలతో కలసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆ అల్లా ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలన్నారు.