మేడారం ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ప్రారంభం
MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా సత్తుపల్లి డిపో నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏటూరునాగారం మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు మంగళవారం ప్రారంభించారు. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం ఈ ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.