ఒరిగిన స్తంభం.. పడితే ప్రమాదం

ఒరిగిన స్తంభం.. పడితే ప్రమాదం

MBNR: చిన్నచింతకుంట మండలంలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్తు స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రెండు నెలల క్రితం ఈదురుగాలులకు పెద్ద వడ్డేమాన్ శివారులో రైతు సత్యనారాయణ పొలంలో స్తంభం ఓ వైపు ఒరిగింది. ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి స్తంభాన్ని సరిచేయాలని కోరుతున్నారు.