ఒకేసారి 7 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన
AP: చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఒకేసారి 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రూ.2,203 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పలు సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడి.. సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని సూచించారు.