పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

NZB: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రతీ బుధవారం జరిగే సంత (అంగడి)లో ప్లాస్టిక్ బ్యాగులు వద్దు గోనె సంచులే ముద్దు అనే నినాదంతో భూమిలో తొందరగా కరిగిపోయే నూలు వస్త్రాలను, జ్యూట్ బ్యాగులను, గోనె సంచులనే వాడాలని లేకపోతే రాబోయే విపరీత విపత్కర పరిణామాన్ని మనమందరం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సామాజిక సేవకుడు కొట్టూర్ అశోక్ అన్నారు.