తై బజార్ వేలం వాయిదా

తై బజార్ వేలం వాయిదా

MLG: ములుగు మున్సిపాలిటీ తై బజార్ బహిరంగ వేలం ఆశించిన స్థాయిలో స్పందన రాక వాయిదా పడింది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ముగ్గురు మాత్రమే పాల్గొనగా, ధరలు తక్కువగా రావడంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వేలాన్ని ఏప్రిల్ 9కి వాయిదా వేయగా, కమేల వేలానికి దరఖాస్తులు రాకపోవడంతో అదే తేదీకి మార్చారు.