విశాఖ నుంచి కొత్త విమానయాన సర్వీసులు

VSP: విశాఖపట్నం విమాన ప్రయాణికులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానయాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12వ తేదీ నుంచి విశాఖ-భువనేశ్వర్ మధ్య అలాగే విశాఖ-అబుదాబి(UAE)కి జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.