VIDEO: గాంధీనగర్లో కుక్కల స్వైర విహారం
WGL: కాశిబుగ్గలోని గాంధీనగర్లో పరిస్థితి ఇది. ఈ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువ అయిపోయిందని స్థానికులు వాపోతున్నారు. పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. రోడ్లపై వెళ్లే వారిని వెంబడిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద తీర్చాలని కోరుతున్నారు.