ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బోడె

ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బోడె

కృష్ణా: పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డాక్టర్ల పని తీరును అడిగి తెలుసుకుంటూ.. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అవసరమైన మౌలిక సదుపాయాలపై వివరాలు తీసుకున్నారు. ప్రజలతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకుని, మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.