ఆరు వేల మందితో దిగ్బంధం చేస్తాం: పట్లోళ్ల కార్తీక్
RR: ప్రజల ప్రాణాల విషయంలో రాజకీయాలకు, రాజకీయలాభాలకు ముడి పెట్టొద్దని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు లైన్ల రోడ్డు మంజూరై ఏడాదిన్నర పైనే అవుతుంది కానీ రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టలేదన్నారు. రోడ్డు పనులను వెంటనే మొదలు పెట్టకపోతే 5,6 వేల మందితో చేవెళ్ల ప్రాంతాన్ని దిగ్బంధం చేస్తామన్నారు.