యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు: కృష్ణ

KDP: యువత బెట్టింగ్ యాప్, లోన్‌యాప్‌లకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ అన్నారు. సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. యువత బెట్టింగ్ యాప్‌ల కోసం అప్పులు చేయడం సరికాదన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా విద్యారంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.