మందు బాబును రక్షించిన పోలీస్

మందు బాబును రక్షించిన పోలీస్

NLR: ప్రస్తుతం మండుతున్న ఎండల తీవ్రతకు మందుబాబుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కందుకూరులో పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగి ముళ్ల చెట్లలో పడిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయించి ఆసుపత్రికి తరలించారు.