ప్రమాదాల నిలయంగా 'జారుడు బండ' మలుపు

ప్రమాదాల నిలయంగా 'జారుడు బండ' మలుపు

JGL: కలికోట-రుద్రంగి సరిహద్దులో ఉన్న జారుడు బండ మూల మలుపు వద్ద ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంది. కనీసం హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కొత్తగా వచ్చే వాహనదారులు మలుపును గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారి రాజన్న క్షేత్రానికి HYDకు వెళ్లే మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.