సొంత గ్రామంలో ఓటమిపై ఎమ్మెల్యే ఆవేదన
MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ తన సొంత గ్రామంలో గ్రామ అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు ఇస్తే గ్రామపంచాయతీ ఎన్నికల్లో.. సొంత ఊరు వారే గుండెలపై కొట్టారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. నేను స్థానికుడిని, నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం అసెంబ్లీలో కొట్లాడుతున్నానని.. ఉదండాపూర్ భూ నిర్వాసితులకు అధిక ప్యాకేజీ పెంచాలని కొట్లాడానన్నారు.