VIDEO: వేయి స్తంభాల గుడికి కర్తీక పౌర్ణమి శోభ
HNK: కాకతీయుల కళా కట్టడమైన వేయిస్తంభాల దేవాలయం కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. బుధవారం రాత్రి సమయంలో వేల సంఖ్యలో మహిళలు, భక్తులు ఆలయానికి తరలివచ్చి, రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి దీపాలు వెలిగించి, తమ దైవభక్తిని చాటుకున్నారు. ఆలయం మొత్తం భక్తులతో కోలాహలం నెలకొంది.