ఖేల్ ఇండియా నేషనల్ టీంకు కోచ్‌గా వనపర్తి యువతి

ఖేల్ ఇండియా నేషనల్ టీంకు కోచ్‌గా వనపర్తి యువతి

WNP: ఖేల్ ఇండియా యోగా నేషనల్ టీం కోచ్‌గా జిల్లా కేంద్రానికి చెందిన దండు సుగుణ ఎంపికయ్యారు. ఆమె మార్చి 29 నుంచి 31 వరకు ఢిల్లీ ఆనంద్ భవన్ ఆశ్రమంలో జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రావు మాట్లాడుతూ.. సుగుణ అస్మిత ఖేల్ ఇండియా యోగా నేషనల్ టీంకు కోచ్‌గా ఎంపిక కావటం జిల్లాకు గర్వకారణమని అభినందించారు.