కార్గో ఎయిర్ పోర్ట్‌కు వ్యతిరేకంగా కళాజాత

SKLM: కార్గో ఎయిర్ పోర్ట్‌కు వ్యతిరేకంగా పోరాట కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం కళాజాత నిర్వహించారు. మందస మండలంలోని బిడిమి, గంగువాడ, రాంపురం గ్రామాలలో కళాజాత నిర్వహిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. 1400 ఎకరాల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.