VIDEO: ‘BMW’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ‘అద్దం ముందు’ అంటూ సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ ఆలపించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.