'నిరవధిక సమ్మెకు సహకార ఉద్యోగులు సన్నద్ధం'
VZM: సమస్యలు పరిష్కరించే వరకు సహకార సంఘ ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటారని ఆ సంఘం రాష్ట్ర నాయకులు నారాయణరావు తెలిపారు. గత రెండు నెలలుగా పలు రూపాలలో ఉద్యోగులు నిరసన తెలియజేసిన ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక జేఏసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 2060 పీఎసీఎస్ఎల్‌లో రైతులకు సేవలు నిలిచిపోతాయని చెప్పారు.