అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
JGL: ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలంలో ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. బుగ్గారం మండల కేంద్రంలో రూ. 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవనం, వెలుగొండ గ్రామంలో రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు, అదనపు తరగతి గదులు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభిచారు.