ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

NLG: తిప్పర్తి మండలం పజ్జురుకు చెందిన దేవుడి ఆంబోతు మల్లేపల్లి వారిగూడెంలో అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై గ్రామ వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.