మద్యం దుకాణం నిర్వహణకు రీ-నోటిఫికేషన్
ASR: జీ.మాడుగులలో మద్యం దుకాణం నిర్వహించేందుకు రీ-నోటిఫికేషన్ జారీ చేశామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్.గౌరీశ్వరరావు బుధవారం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు తిరిగి చెల్లించబడని రూ.2లక్షల చలానా ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. ఈనెల 10లోగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు పాడేరు ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.