నేేడు వరంగల్‌లో KCR పర్యటించుచున్నారు

వరంగల్: కేసీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరవాతండాకు రానున్నారు. ఉదయం ఎర్రవల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30కు దరవాత్ తండాకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేట జిల్లాకు వెళ్తారు. కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.