నిరుపయోగంగా రిసోర్స్ సెంటర్

నిరుపయోగంగా రిసోర్స్ సెంటర్

GNTR: గుంటూరులోని జోసెఫ్ కాలనీ 1వ లైన్ వద్ద ఉన్న నగరపాలక సంస్థ సిటిజన్ రిసోర్స్ సెంటర్ పూర్తిగా నిరుపయోగంగా మారిందని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు నిలిచిపోవడంతో ఈగలు, దోమలు పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వారు తెలిపారు. చుట్టూ ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉందని, తక్షణమే అధికారులు స్పందించి సెంటర్‌ను అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.