ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
PLD: వెల్దుర్తి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన ఆయన, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి, తక్షణమే పరిష్కరించాలని సూచించారు.