పాపికొండల పర్యాటకులకు అవగాహన
ASR: దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటక బోట్లలో వెళ్లే పర్యాటకులకు అధికారులు మైకు ద్వారా హెచ్చరికలు చేశారు. శనివారం 3 పర్యాటక బోట్లలో 173 మంది పర్యాటకులు గోదావరి నదిలో విహారయాత్రకు వెళ్లినట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. పర్యాటకులకు అవగాహన కోసం మైకుల ద్వారా హెచ్చరికలు చేస్తున్నామని అధికారులు చెప్పారు.