'రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది'
SRCL: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడిగే లావణ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.