వర్మీ కంపోస్టుపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

SKLM: తడి చెత్తను సేకరించి వర్మీ కంపోస్టు తయారు చేసి తద్వారా పంచాయతీలకు ఆర్ధిక వనరులు సేకరించాలని డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్ పేరాడ ఆనందరావు అన్నారు. నందిగాం మండలం స్థానిక చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు గురువారం శిక్షణను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొడి చెత్త నుంచి కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు.