ఈ నెల 17 నుండి కుష్టు వ్యాధి గుర్తింపుకు ప్రత్యేక డ్రైవ్

ఈ నెల 17 నుండి కుష్టు వ్యాధి గుర్తింపుకు ప్రత్యేక డ్రైవ్

VZM: ఈ నెల 17 నుంచి 30 వరకు జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. శనివారం కలక్టరేట్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, కుష్టును సమాజం చిన్న చూపు చూస్తుందన్న అపోహను విడనాడితే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు.