మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

VZM: సంతకవిటి మండలం బలరాంపేట గ్రామానికి చెందిన సింగువరపు సుగుణ మనస్థాపానికి గురై ఈ నెల 26న కనిపించకుండా వెళ్లిపోయింది. తన సోదరుడు సింగపురపు అప్పల రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నట్లు సంతకవిటి ఎస్సై గోపాలరావు తెలిపారు. ఇంట్లో ఉంటూ కుటుంబ సమస్యలు పెరిగిపోతున్న కొద్దీ మనస్థాపానికి గురై ఎక్కడికో వెలుండొచ్చని ఫిర్యాదు అందిందన్నారు.