రబీ సీజన్‌కు ఎరువులు సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్
NZB: రబీ సీజన్లో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక వేస్తున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్‌లోని సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలను ఈపాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు.