'గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేయండి'
KKD: తుని నియోజకవర్గంలోని పల్లె రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం సీఎం చంద్రబాబును కలిసి నిధులు కోరినట్లు చెప్పారు. తుని పరిసర గ్రామాల అభివృద్ధికి సుమారు రూ. 10.80 కోట్లను నాబార్డు, SASCI నిధుల ద్వారా కేటాయించాలని వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.